బ్రహ్మసముద్రం మండల బలిజలతో ఆత్మీయ సమావేశం

కళ్యాణదుర్గం నియోజకవర్గం: బ్రహ్మసముద్రం మండలం, బుడిమేపల్లి గ్రామంలో టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అత్యధిక మెజారిటీతో గెలుపు కోసం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు లక్ష్మీనరసయ్య రాయల్ & గాజులపల్లి రమేష్ ఆధ్వర్యంలో బలిజ కమ్యూనిటీలోని బలిజలందరితో సమావేశమై, వారితో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో సురేంద్రబాబు గారికి మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. బలిజలందరూ సానుకూలంగా స్పందించి, కచ్చితంగా సురేంద్రబాబు గారికి మద్దతిచ్చి, మా బలిజ కమ్యూనిటీలోని ఓట్లు అన్ని వేసి, సురేంద్రబాబు గారి గెలుపు కోసం కృషి చేస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్, నియోజకవర్గ జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ రాయుడు, కళ్యాణదుర్గం జనసేన ముఖ్య నాయకులు రుహుల్ల, రఘు, బ్రహ్మసముద్రం మండలం జనసేన పార్టీ నుండి బుడిమేపల్లి తిమ్మరాజు, వకీల్ రాజన్న, కాలువ ధనంజయ, మహేష్ పాల్గొన్నారు.