పవన్ కళ్యాణ్‌ కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోవాలి

  • ములకలపల్లి ఎస్.ఐ కి కంప్లైంట్ ఇచ్చిన జనసేన నాయకులు

అశ్వారావుపేట: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై, ఆయన కుటుంబ సభ్యుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరీ శంకర్ గౌడ్, పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తాళ్లూరి రామ్, రాధారం రాజలింగం, దుంపటి శ్రీనివాస్, అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డేగల రామచంద్రరావు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు యార్లగడ్డ శ్రీనివాసరావు, జనసేన ముఖ్య నాయకుల ఆదేశాల మేరకు ములకలపల్లి మండలంలో పోలీస్ స్టేషన్ ఎస్.ఐ సాయి కిషోర్ రెడ్డికి కంప్లైంట్ పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు రాంబాబు, ములకలపల్లి మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, మండల నాయకులు నాయకులు ఎస్ కే జాన్ పాషా, బోడ నాగరాజు నాయక్, బొక్క వెంకటేశ్వర్లు, గ్రామ కమిటీ నాయకులు గోపగాని సాయి ప్రకాష్, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.