ఇంటింటా క్రియాశీల సభ్యత్వ నమోదు అవగాహనా కార్యక్రమం

శ్రీకాళహస్తి: క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఏర్పేడు మండలం, చెల్లూరు గ్రామంలో ఇంటింటికీ పర్యటించి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించడం జరిగింది అలానే ప్రజల సమస్యలు అడిగి తెలుసు కోవడం జరిగింది. రైతులను ఏ మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వం విఫలమైందని, నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని వాపోయారు. అందరికీ అవకాశం ఇచ్చాం. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తాం అని ప్రజలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు లోకనాధం, ఉదయ్, నితీష్ కుమార్, చందు చౌదరి, భాను, వెంకటరమణ, బాలాజీ, గిరీష్, జనసైనికులు జగదీష్, ప్రకాష్, గాంధీ, లోకేష్, సబ్బరాయలు, నరేష్, లక్ష్మి, మహేష్, ఆనంద్, వాసు, నిరంజన్, లోకేష్, విజయ్, సుబ్రమణ్యం, బతీష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.