ఆపదలో ఆదుకున్న జనసేన క్రియాశీలక సభ్యత్వం

పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం, చిన దొడ్డిగొళ్లు గ్రానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త బద్ది గంగరాజు ఇటీవల బైక్ ఆక్సిడెంట్ లో తీవ్రముగా గాయపడి వైద్యం చేయించుకుని కోలుకున్నాడు.. క్రియాశీలక సభ్యత్వం ఉన్న గంగరాజుకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ శాంక్షన్ కాగా, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 50,000 రూపాయల ఇన్సూరెన్స్ చెక్ ను పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జికి పంపించి, క్రియాశీలక కార్యకర్త గంగరాజుకి అందించవలసినదిగా సూచించారు. ఈ మేరకు గెడ్డం బుజ్జి 50,000 రూపాయలు చెక్ ను గెడ్డం బుజ్జి ఆదేశాలమేరకు యువనాయకులు గెడ్డం చైతన్య, బాధితుడి గృహానికి వెళ్లి బద్ది గంగరాజుకు దొడ్డిగొళ్ళు గ్రామ నాయకులు మరియు జనసైనికులు సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లల రత్నాజి, వెలగా బుజ్జి, బద్ది గోవిందరావు, బోయిన సురేష్, లోవరాజు, తాతాజి, రాంబాబు, వెలగా కన్నారావు, బాబ్జి మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.