గుంటూరు కార్పొరేషన్ 48వ వార్డు యువత జనసేనలో చేరికలు

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 48వ వార్డు రెడ్డిపాలెం ప్రగతి నగర్ నుంచి ఆదివారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మరియు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ల సమక్షంలో ప్రగతి నగర్ కాలనీ యువత వంశీ, క్రాంతి, వరదరాజు, మరియ బాబు, పవన్, విజయ్, సాగర్ తదితరులను పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. బడుగు బలహీన వర్గాల వారికి పార్టీ అన్ని వేళల తోడు ఉంటుందని వారికి ఎటువంటి సమస్య వచ్చినా పార్టీ ముందు ఉంటుందని భరోసా కల్పించారు నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, త్రినాధ్, మధు లాల్, అంబటి కుమారు లు నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.