నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరికలు

రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం డైరెక్టర్, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అల్లంకి నాగేశ్వరావు, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్లు కోటంశెట్టి సత్యనారాయణ, సలాది సుబ్రమణ్యం, రెడీమేడ్స్ వర్తక సంఘం వైస్ ప్రెసిడెంట్ వడగన వీరభద్రరావు, బోగిరెడ్డి బాబ్జి, సప్పా శ్రీనివాసరావులతో పాటు మరికొందరు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరంతా జనసేన కండువా కప్పుకున్నారు. వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మనోహర్ అంతా కలసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు పంతం నానాజీ, జనసేన పాల్గొన్నారు.