జగనన్న కాలనీలను సందర్శించిన ఐనాబత్తిన రాజేష్

కొండేపి నియోజకవర్గం: సింగరాయకొండ మండలంలో శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సూచనల మేరకు సింగరాయకొండ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లను గ్రామాల వారీగా సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఏ విధంగా జరిగినదంటే .. జగనన్న లే అవుట్ లో బూమ్ బూమ్ మరియు బ్లాక్ బస్టర్, ఏపుగా పెరిగిన చిల్ల చెట్లు, రోడ్లు లేకుండా ఉన్న జగనన్న లేఅవుట్లు, స్తంభాలు పడిపోయే దుస్థితి, అద్వానంగా ఉన్న రోడ్లు, చెరువులు, స్మశానాలలో జగనన్న ఇళ్ళ స్థలాలు, తుఫాను సమయంలో మునిగిపోయే దుస్థితిలో జగన్నన లేఅవుట్లు, పైపులైన్లు వేసి కనెక్షన్లు ఇవ్వకపోవడం, అప్పుల పాలైన జగన్నన ఇంటి యజమానులు, బలవంతంగా ఇల్లు నిర్మించాలని బెదిరిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం, అనువైన స్థలాలను వైసీపీ బినామీలకు కేటాయించడం, జగనన్న స్థలాలను అనర్హులకు ఇచ్చి రెండు స్టేర్లు కట్టించడం, నిజమైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం, జగనన్న లేఅవుట్ లో ప్రజాధనాన్ని కోట్ల రూపాయలలో వృధా చేయటం, జగనన్న ఇళ్లు పేదల కన్నీళ్లు… ఏరులై పారటం, ఈ అనర్హులకు ప్రభుత్వం జగన్నన లే అవుట్ లో బారి మోసం. రాష్ట్ర ప్రజలారా వైసిపి ప్రభుత్వం ప్రజల సొమ్మును ఏ విధంగా దుర్వినియోగం చేసిందో, ఒక్కసారి ఫోటోలను మరియు వీడియోలను చూసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి జనసేన ప్రభుత్వాన్ని పూర్తి మెజార్టీతో స్థాపించాలని జనసేన పార్టీ నుండి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవడం అయినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల ఉపాధ్యక్షులు సయ్యద్ చాన్ భాష, అధికార ప్రతినిధి సంకే నాగరాజు, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, కార్యదర్శులు అనుమల శెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, వాయుల అనిల్, వాయుల శివ, చేచంగారి బ్రమయ్య వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.