మ్యాన్ వర్సెస్ వైల్డ్ కోసం రియల్ హీరోగా అక్షయ్

రీల్ హీరో నుండి రియల్ హీరోగా మారాడు ఖిలాడీ కుమార్ అక్షయ్. ఇంగ్లండ్ కు చెందిన బేర్ గ్రిల్స్‌తో కలిసి దట్టమైన అడవిలో సాహసాలు చేశారు. డిస్కవరీ ఛానెల్‌లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో రూపొందుతున్న ఈ కార్యక్రమం కోసం అక్షయ్ ఈ ఫీట్ చేశాడు. ఈ కార్యక్రమం డిస్కవరీ ప్లస్ యాప్ లో సెప్టెంబర్ 11న విడుదల కానుంది. సెప్టెంబర్ 14న డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం కానుంది.

ఈ కార్యక్రమానికి సంబంధించి గతంలో ఓ వీడియో విడుదల చేయగా, దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అక్షయ్ తన ట్విట్టర్ ద్వారా మరో వీడియో షేర్ చేశాడు. ఇందులో అక్షయ్, బేర్ చేసే విన్యాసాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. గతంలో ప్రధాని మోదీ, సూపర్ స్టార్ రజనీకాంత్‌.. బేర్‌తో ఇలాంటి సాహస యాత్ర చేయగా, ఇప్పుడు మూడో భారతీయుడు అక్షయ్ కావడం గమనర్హం.