మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో.. అభిమానులకు కన్నుల పండుగ

నిహారిక కొణిదెల కలల వివాహం దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఉదయ్ ప్యాలెస్ (రాజస్థాన్)లో నేటి(బుధవారం) సాయంత్రం అత్యంత వైభవంగా జరగనుంది. నిహారిక- చైతన్య ఇరు కుటుంబాలు.. వారికి చెందిన బంధుమిత్రులు వెన్యూ వద్దకు హాజరై ఇప్పటికే సందడి చేస్తున్నారు. ఇప్పటికే సంబరాలు అంబరానికి చేరుకున్నాయి చేరుకున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ సహా మెగా కుటుంబంలోని హీరోలంతా నిన్నటి సాయంత్రమే వేదిక వద్దకు చేరుకుని సందడి చేశారు.

మంగళవారం సాయంత్రం నిహారిక మెహెంది వేడుక కన్నుల పండుగగా సాగగా ఈ ఈవెంట్ నుండి కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ ఫోటోల్లో సంథింగ్ స్పెషల్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా దూసుకెళుతోంది. ఇందులో టోటల్ మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒకే ఫ్రేమ్ లోకి వచ్చారు. ఇలా జరగడం చాలా అరుదు. ముగ్గురు సోదరులు చిరంజీవి- నాగబాబు- పవన్ కల్యాణ్ సహా మెగా యువహీరోలంతా ఈ ఫోటోలో కనిపించారు. ఈ ఫోటోలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు ఆరున్నర అడుగుల బుల్లెట్టు అకీరా నందన్ కనిపించడం అభిమానుల్లో ఉత్సాహం పెంచింది. అల్లు అర్జున్- శిరీష్ – బాబి త్రయం .. అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. వీరితో పాటు రామ్ చరణ్- వరుణ్ తేజ్- సాయి తేజ్- వైష్ణవ్ తేజ్ – కళ్యాణ్ దేవ్ కనిపించారు. ఈ ఫోటోలోనే కాబోయే హీరో.. నిహారిక హబ్బీ చైతన్య జొన్నలగడ్డ ఉన్నారు.

చాలా కాలం తరువాత ఇలా మెగా-అల్లు ఫ్యామిలీ హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో పట్టుబడ్డారు! హీరోలంతా సాంప్రదాయక దుస్తులను ధరించారు. ఇక ఇదే వేడుకలో మెగాస్టార్ ఎంతో స్టైలిష్ గా కనిపించగా.. రామ్ చరణ్- అల్లు అర్జున్ మిగిలిన కుటుంబ సభ్యులు సంతోషంగా ఫోటోలకు పోజులిచ్చారు. మెహెంది ఫంక్షన్ నుండి నిహారికా -చైతన్య జంట అద్భుత ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.