మృతి చెందిన ఒక్కొ కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి: పెండ్యాల శ్రీలత

• విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు మహిళా కూలీలు మృతి.
• అనంతపురం జిల్లాలో పదేపదే ఇలాంటి ఘటనలు సంభవించినా ప్రభుత్వ అధికారుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ అమాయకులైన కూలీల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు.
• మోటార్లకు మీటర్లు పెట్టడం మీద ఉన్న శ్రద్ధ ప్రమాదకరంగా ఉన్న కరెంట్ తీగల మరమ్మత్తుల మీద చూపించండి.
• రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత.

అనంతపురం జిల్లా, బొమ్మనహాళ్ మండలం, దర్గాహోన్నూరు గ్రామంలో చేతికి వచ్చిన ఆముదం పంటను కోయడానికి ట్రాక్టర్ లో వెళ్తున్న నలుగురు మహిళా కూలీలు మృతిచెందడం చాలా విషాదకరమైన విషయమని రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మృతి చెందిన జి.రత్నమ్మ, పార్వతి, గంగయ్య గారి వన్నక్క, బోయ శంకరమ్మల మృతదేహాలకు నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పొట్టకూటికోసం కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే మహిళా కూలీల మృతి చెందడం బాధాకరమైన విషయమని విద్యుత్ వైర్లు తెగిపడిన ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఉందని క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారమని. అదే విధంగా దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం మీద చూపే శ్రద్ధను ముందుగా విద్యుత్ తీగలు, స్తంబాలు సక్రమంగా ఉంచడం మీద పెట్టాలని. అదేవిధంగా ఉడతలు కొరికాయి కాబట్టి తీగలు తెగి ఇలాంటి ఘటనలు జరిగాయన్న కారణాలు చెప్పి సమస్యను మరుగున పడేయవద్దని మృతి చెందిన ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించాలని అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలు పూరె గుడిసెలో నివసిస్తున్నందువల్ల వారికి పక్కా ఇళ్ళు కట్టించి భూమి లేని వారికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, వీరమహిళలు సరోజమ్మ, శైలజ, నాయకులు నీలారెడ్డి రామ్మోహన రెడ్డి, దండు హరీష్ కుమార్, మధు తదితరులు పాల్గొనడం జరిగింది.