ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 10వ రోజు

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలోని వల్లూరు పంచాయతీలో మంగళవారం ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 10వ రోజు కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో బాగంగా జనసేన నాయకులు ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సి.హెచ్ కసుమూరు, నీళ్ల విష్ణు, తాండ్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు.