Tanuku: గంజాయి అక్రమ రవాణాపై CBI దర్యాప్తు చేపట్టాలి : జనసేన నాయకులు అనుకుల రమేష్

రాష్ట్రంలో గంజాయ్ అక్రమ రవాణా అనేది చాప కింద నీరులా తయారైంది. గంజాయి అక్రమ రవాణా ఎక్కడ జరుగుతుంది, ఎక్కడి నుండి వస్తుంది అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దీని గురించి పోలీసులు కానీ అధికారులు నుంచి గానీ ఎటువంటి స్పందన లేదు.

దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతం సవాంగ్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి గంజాయి అక్రమ రవాణా దారులు ఎవరన్న విషయం తేల్చి, అలాగే ఈ విషయం పై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని తణుకు జనసేన పార్టీ నాయకులు అనుకుల రమేష్ జనసేనపార్టీ తరపున కేంద్రాన్ని కోరడం జరిగింది.