విజ‌య్ సేతుప‌తితో కలసినటించనున్న అనుష్క

చేతి నిండా సినిమాలతో  చాలా  బిజీగా ఉంటూ తెలుగు, త‌మిళ చిత్రాల్లో విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకున్ననటుడు విజ‌య్ సేతుప‌తి. బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌తో ‘లాల్‌సింగ్ చ‌ద్దా’ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్పుడు ఈ విల‌క్ష‌ణ న‌టుడితో డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్ ఓ సినిమాను తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇందులో హీరోయిన్‌గా అనుష్క శెట్టిని న‌టింప చేయ‌డానికి చర్చలు జరుగుతున్నయట. గ‌తంలో విజ‌య్ తెర‌కెక్కించిన చిత్రం నాన్న‌లో అనుష్క కీల‌క పాత్ర‌లో న‌టించగా… అదే ప‌రిచ‌యంతో అనుష్క ఈ సినిమాలో యాక్ట్ చేయ‌డానికి ఒప్పుకుంటుంద‌ని డైరెక్ట‌ర్ విజ‌య్ గట్టి న‌మ్మంతో ఉన్నార‌ట‌.