ఈసీయల్ ఫ్యాక్టరీ కాలుష్యం నుండి కాపాడండి – రాచగున్నేరి ప్రజలు

  • ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర 46వ రోజు
  • 46వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి మండలం, చిన్న రాచ గన్నేరి గ్రామంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. బాణసంచా, పూల వర్షంతో జనసైనికులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామంలో ప్రధానంగా ఈసీయల్ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు, గ్రామంలో పశుసంపద అంతరిస్తుందని, స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం లేదని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని వినుత ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, జనసైనికులు అశోక్, దిలీప్, ముని బాబు, నాయకులు చెంచుముని, తోట గణేష్, పేట చంద్ర శేఖర్, రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, లక్ష్మి, రాజ్య లక్ష్మి, కవిత, సురేష్, రాజేష్, గురవయ్య, జ్యోతి రామ్, హేమంత్ గౌడ్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.