ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం 21వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, కంచన పల్లి పంచాయతీలో ఈ రోజు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామంలో పారిశుధ్యం, డ్రైనేజ్ కాలువలు, సీ సీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు సమస్యలు గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్యం అధికారంలోకి వచ్చిన 3-6 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, నాయకులు తోట గణేష్, రవి కుమార్ రెడ్డి, శారద, చిరంజీవి, సురేష్, రాజేష్, మునయ్య, గురవయ్య, లక్ష్మి, రాజ్య లక్ష్మి జనసైనికులు మురుగా, దినేష్, హేమంత్, సురేంద్ర, దుర్గ ప్రసాద్, బబ్లూ, తదితరులు పాల్గొన్నారు.