కొటికలపూడి గోవిందరావు అరెస్ట్ అప్రజాస్వామికం: మంద నవీన్

పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) ను అప్రజాస్వామికంగా, అన్యాయంగా, అరాచకంగా అరెస్టు చేయడాన్ని పెనుగొండ మండల జనసేన ప్రధాన కార్యదర్శి మంద నవీన్ జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ.. ప్రభుత్వం పిరికి పందలా ప్రవర్తిస్తుంది. వారి కార్యకర్తలు కూడా యథారాజ తథాప్రజలా ప్రవర్తిస్తున్నారు. మీరు ఇటువంటి చర్యలు చేస్తే చర్యకి ప్రతి చర్య డబుల్ ఉంటుంది అని ఆయన హెచ్చరించడం జరిగింది. రాబోయేది ప్రజా ప్రభుత్వం మీకు ఖచ్చితంగా సమధానం చెప్పబోతుందని ఆయన అన్నారు.