యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: పాలకొండ జనసేన

పాలకొండ: జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యువశక్తి కార్యక్రమం జనవరి 12వ తేదీన రణస్థలంలో జరుగుతుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు యువతని రాజకీయాల్లోకి అడుగులు వేయించాలనే తపనతో జనసేన పార్టీ యువతకి భరోసాని కల్పించడానికి యువశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి పాలకొండ నియోజకవర్గం యువత హాజరై విజయవంతం చేస్తారని కోరుకుంటూ గ్రామ గ్రామాలలో యువశక్తి కార్యక్రమం కోసం యువత ను బలోపేతం చేసేవిధంగా శుక్రవారం పాలకొండ నియోజకవర్గంలో ప్రచారం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బీపీ నాయుడు, అల్లు సాయిరాం కుమార్, మత్స పుండరీకం, జనసేన జానీ, ప్రశాంత్ పోరెడ్డి, రమేష్ పొట్నూరు, జామి అనిల్ సాయి పాల్గొన్నారు.