గణపతి కుంటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపిన అతిగారి దినేష్

రాజంపేట: అన్నమయ్య జిల్లా, నందలూరు మండలంలోని బలిజపల్లెకు చెందిన జనసైనికుడు గణపతి ఉగ్ర లక్ష్మి నరసింహులు తల్లి మూడు రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలుసుకున్న రాజంపేట జనసేన నాయకుడు అతిగారి దినేష్ వారి కుంటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. జనసైనికుడు ఉగ్ర లక్ష్మి నరసింహాను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందలూరు జనసేన నాయకులు మస్తాన్ రాయల్, పోత్తపి జనసైనికులు సాంబవు వెంకటేశ్, వెంకట ప్రసాద్, గణపతి వెంకటేశ్, హరి, వెంకట గణేష్, హరి, రమేష్, రాజేష్, శ్రీకాంత్, నరేంద్ర జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.