మహిళా విలేఖరిపై దాడి చేయడం పిరికిపంద చర్య: గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు, ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారమిస్తే… మీరు చివరకు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడలేని స్థితికి పరిపాలన దిగజారిందని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన మహిళ విలేఖరి మల్లీశ్వరి పై దాడికి దిగడం. ద్విచక్రవాహనంపై పెట్రోల్ పోసి నిప్పటించి వాహనాన్ని దగ్ధం చేయడం అమనుషమని అన్నారు. పల్నాడు ప్రాంతంలో అనేక ప్రజా సమస్యలని బయటకు తెచ్చి వాటి పరిష్కారానికి కోసం పనిచేస్తున్న మహిళ పై కక్ష కట్టి ఈ విధంగా చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. దుండగులు ఎవరైనా గాని వారిని తక్షణమే పట్టుకొని తీవ్రంగా శిక్షించాలని ఎస్పీని కోరారు. జనసేన పార్టీ మల్లీశ్వరి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు బాధ్యతతో వ్యవహరించాలని లేకపోతే త్రివ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భవిష్యత్తులో మల్లేశ్వరిపై దాడులు జరిగితే దానికి అధికార పార్టీదే బాధ్యతని అన్నారు. స్థానికంగా ఉండే జనసేన పార్టీ మండల అధ్యక్షులు మల్లీశ్వరి కుటుంబానికి అండగా ఉంటారని చెప్పారు.