పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆస్ట్రేలియా హై కమిషనర్ శ్రీ ఫిలిప్ గ్రీన్ గారు బుధవారం సాయంత్రం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ ఫిలిప్ గ్రీన్ గారిని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియచేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఈ చర్చల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా హై కమిషన్ ఎకనామిక్ కౌన్సిలర్ శ్రీ జూలియన్ స్టోర్మ్, ఆస్ట్రేలియా హై కమిషన్ అగ్రికల్చర్ కౌన్సిలర్ శ్రీ కిరణ్ కరమిల్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *