జనసేన ఆధ్వర్యంలో ఆదర్శ రైతులకు సన్మానం

రాజంపేట, సిద్ధవటం మండల పరిధిలోని భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న ఏపీ ఎస్పీ 11వ బెటాలియన్ లో రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ సహకారంతో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఆదర్శ రైతులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెటాలియన్ కమాండెంట్ ఎన్ శ్రీనివాసరావు హాజరరై 12 మంది ఆదర్శ రైతుల కుసన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగ అభివృద్ధిలో రైతుల పాత్ర ఎంతో కీలకమని, దేశానికే వెన్నెముక రైతు అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ పోలీసులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.