శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల్ని పర్యవేక్షించిన బాబుపాలురు

ఉమ్మడి విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలం, తోటపల్లి చిన తిరుపతిగా పిలుచుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధ దేవాలయం పునర్నిర్మాణ పనుల్ని జనసేన పార్టీ తరపున రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబుపాలురు, మరియు జిల్లా నాయకులు, జనసైనికులు పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడి దేవాలయ అధికారులు, ఆలయ సిబ్బంధి, భక్తులు మరియు చిరువ్యాపారులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.