పలుకుటుంబాలకు పితాని బాలకృష్ణ పరామర్శ

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం, దొమ్మేటి వారి పాలెం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన దొమ్మేటి సూర్యవతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు అదే గ్రామానికి చెందిన అనారోగ్యంతో మృతి చెందిన గుత్తుల సూర్యకాంత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట రాష్ట్ర కార్యదర్శి జక్కం శెట్టి బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, కడలి వెంకటేశ్వరరావు, పితాని రాజు, గుత్తుల వెంకట్రావు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.