ఎయిరిండియా విమానాలపై నిషేధం.. ‘వందే భారత్ మిషన్’ ప్రాజెక్టుకు బ్రేక్

వందే భారత్ మిషన్ ప్రాజెక్టుకు చిన్నపాటి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ నుంచి ఎయిరిండియా విమానాల రాకపోకలను హాంకాంగ్ నిషేధించింది. భారత్‌లో కోవిడ్19 పాజిటివ్ కేసుల తీవ్రత నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడం, అత్యవసరమైన వారిని విదేశాలకు తీసుకెళ్లడంలో భాగం ఏర్పాటు చేసిందే ఈ ‘వందే భారత్ మిషన్’ ప్రాజెక్టు.

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గించేందుకు లాక్‌డౌన్ విధించగా విదేశాల నుంచి భారత్‌కు విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఓడలు, విమానాల ద్వారా విదేశాలలోని భారత ఎంబసీ అధికారుల సాయంతో సొంత ప్రాంతానికి తీసుకొస్తున్నారు. అయితే భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య ఎయిరిండియా విమానాల రాకపోకలను నిషేధించింది.