కొత్తపల్లి నగేష్ ను అభినందించిన బండారు శ్రీనివాస్

  • బండారు చేతుల మీదుగ పశుగ్రాసం పంపిణి

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండలం నందు గత 25 రోజుల నుంచి వరదలు హెచ్చుతగ్గులు కారణంగా, అకాల వర్షాలతో గోదావరి నీటి ప్రవాహంతో చెయ్యేరు లంక భూమి గ్రామాల పరిసరాలు నీటి మునిగిపోవడంతో పశువులు ఆలమూరు మండలం జొన్నాడ గ్రామం చేరుకున్న పశువులకు, మేత నీరు లేక అలమటించి పోతున్నాయని తెలుసుకొని, 7500 రూపాయలు విలువైన పశుగ్రాసం 300 కేజీలు ప్రముఖ జనసైనికులు కొత్తపళ్లి నగేష్ ఆధ్వర్యంలో వారి సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన దానాను బుధవారం జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ చేతుల మీదుగా పశువుల కాపరిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల జనసైనికులు, కార్యకర్తలతో పాటు ఆత్రేయపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు, సలాది జయప్రకాష్ నారాయణ(జెపి), చింతపల్లి శ్రీనివాస్, మహాదశ బాబులు, తదితరులు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.