అంగన్వాడీ వర్కర్స్ కు మద్దతుగా బండారు శ్రీనివాస్

కొత్తపేట, అంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్ యూనియన్ చేస్తున్న సమ్మెకు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి బండారు శ్రీనివాస్ సోమవారం మద్దతు తెలుపుతూ కొత్తపేట బస్టాండ్ సెంటర్లో నియోజకవర్గ స్థాయిలో అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న నిరసన శిబిరంలో పాల్గొని వారి డిమాండ్ల అడిగి తెలుసుకున్నారు. వారు డిమాండ్ చేసున్న వేతనాలు పెంపు, పెన్షన్, చిన్న సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చెయ్యడం, గ్రాడ్యూటీ అమలు విషయం కావచ్చు, పెండింగ్ ఉన్న బకాయిలు, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు విషయం కావచ్చు ఇలా వారు అడుగుతున్న ప్రతి డిమాండ్ నాణ్యమైనది అని శ్రీనివాస్ వాటిని వెంటనే వైసీపీ ప్రభుత్వం పరిష్కారించాలి అని కోరారు. లేనిపక్షంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తెలియచేసి అంగన్వాడీ వర్కర్స్ కు మద్దతుగా పోరాటం చేస్తాం అని తెలియచేశారు.