పలు కుటుంబాలను పరామర్శించి.. వారిలో దైర్యాన్ని నింపిన బండారు శ్రీనివాస్

  • ఆలమూరు గ్రామం నందు కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన ప్రముఖ జనసేన నేత, కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్!
  • కొత్తపేట నియోజకవర్గం: కష్టకాలంలో ఉన్నారని తెలిస్తే ఆగ మేగాల మీద వచ్చే గొప్ప నాయకుడు మనసున్న మారాజు బండారు శ్రీనివాస్ జనసేన కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జ్ నాయకత్వానికి పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
  • ఆలమూరు గ్రామంలో కొద్దిరోజుల క్రితం స్వర్గస్తులై గంధం సూర్యనారాయణ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, మరియు నరాల చిన్ని స్వర్గస్తులైన కారణంగా వారి కుటుంబాలను పరామర్శించారు.

కొత్తపేట నియోజకవర్గం: అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండలంలోని, ఆలమూరు గ్రామం నందు గురువారం జనసేన ప్రముఖ నాయకులు కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్, ఆలమూరు గ్రామం నందు పర్యటించారు. గత కొద్ది రోజుల క్రితం ఆలమూరు గ్రామంలో స్వర్గస్తులైన ఇరు కుటుంబాలను కలిసి ఎంతో ఓదార్పునిస్తూ, అండగా మేము ఉంటామని, అధైర్యఒ చెఒదవద్దని, గత కొద్ది రోజుల క్రితం గంధం సూర్యనారాయణ రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయ్ స్వర్గస్తులైన కారణంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం శెట్టిబలిజ కులానికి చెందిన నరాల నారాయణ గతంలో స్వర్గస్తులైన వీరి సోదరులు కుమార్తె నరాల చిన్ని 17 సంవత్సరాల యువతి అనారోగ్య కారణంగా కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో వారి కుటుంబాన్ని కలిసి వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఓదార్పునిస్తూ, ధైర్యం చెప్పి, కష్టసుఖాల్లో జనసేన కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిస్తూ, పలువురు జనసైనికులు కార్యకర్తలతో గురువారం ఆలమూరు గ్రామం నందు పర్యటించి, పలువురు కష్టసుఖాలను బండారు శ్రీనివాస్ జనసేన ఇన్చార్జ్ కొత్తపేట నియోజకవర్గం నేత పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ జనసేన నేతలు సలాధి జయప్రకాష్ నారాయణ (జెపి) చల్లా బాబి, చల్లా వెంకటేశ్వరరావు, సిరిగినీడి పట్టాభి, కట్టా రాజు ఆలమూరు గ్రామం జనసేన అధ్యక్షులు, పరమట గణేష్, కోట వరలక్ష్మి కొండేటి హైమాదేవి, ఆలమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సురపురెడ్డి సత్య, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.