చిలుకూరి గాంధీని పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామ వాస్తవ్యులు చిలుకూరి గాంధీ హార్ట్ స్ట్రోక్ కారణంగా రాజమహేంద్రవరం కమలాకర్ హాస్పిటల్ నుందు చికిత్స పొందుతున్నారు. భూపాలపట్నం సర్పంచ్ గుల్లింకల లోవరాజు ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ హాస్పిటల్ కి వెళ్ళి గాంధీ కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యాన్ని చెప్పి, గాంధీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుల్లింకల లోవరాజు, మదిరెడ్డి బాబులు, దేవన దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.