కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను అందజేసిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, కణుపూరు గ్రామంలో 28వ షష్ఠి మహోత్సవాలు సందర్బంగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి” చేతులు మీదుగా ట్రోఫీస్ & ప్రైజ్ మనీ చెక్లను అందచెయ్యటం జరిగింది.
ట్రోఫీ మెదటి బహూమతి 15,000, ట్రోఫీ రెండవ బహూమతి 10,000, ట్రోఫీ మూడో బహూమతి 6,000, ట్రోఫీ నాలుగోవ బహుమతి5,000, బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. ఈ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి జట్టుకి శుభాకాంక్షలు తెలియజేసి ఆటల్లో మంచి ప్రతిభ కనబరిచినవారిని ప్రోత్సహించాలి. అలానే ముఖ్యంగా విధ్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న శక్తిని ఆటల ద్వారా చైతన్యవంతం చేస్తే వారు క్రమశిక్షణగల ఉత్తమ పౌరులుగా ఎదుగుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కబడ్డీ ఆటగాళ్లు, కణుపూరు గ్రామ జనసేన పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.