వడ్డి శ్రీనివాస నాయుడుకు ఘన నివాళులు అర్పించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరంలో రాజకీయాలలో వడ్డి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆదర్శమూర్తి కీ.శే వడ్డి శ్రీనివాస నాయుడు వర్ధంతి సందర్భంగా రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి జనసేన కుటుంబంతో కలిసి వెళ్లి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ భవిష్యత్తులో రాజకీయంగానూ, ఆపత్కాలంలో అండగా ఉంటామని.. రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కీర్తి ప్రతిష్టలు పెంచిన వడ్డి శ్రీనివాస నాయుడు గారి సోదరుడు వడ్డి సత్యానందమూర్తి (చిన్న) గారు ఇకపై రాజకీయాలలో తమ పూర్వవైభవం కనబరచాలని.. జనసేన జెండా రాజానగరం నియోజకవర్గంలో ఎగుర వేయడానికి మీ పూర్తి సహాయ సహకారాలతో అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేసారు. ఇకపై నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా వడ్డి కుటుంబంతో ముడిపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.