గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం చేయించిన బత్తుల

రాజానగరం: జనసేన పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న దోసకాయలపల్లి గ్రామ దళిత యువనాయకులు కొల్లు రమేష్ అబ్బాయిని సోమవారం ఉదయం కుక్క కరిచి గాయంకావడంతో వెనువెంటనే వారు స్థానిక హాస్పిటల్ కు తరలించగా అక్కడ వ్యాక్సిన్ లేదని చెప్పడంతో.. నిరుత్సాహనికి గురై రమేష్ గ్రూపుల్లో ట్రీట్మెంట్ అందని విధానం గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది.. ఇదంతా గమనించిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి హుటాహుటిన దోసకాయపల్లి గ్రామం కొల్లి రమేష్ ఇంటికి చేరుకుని వారి అబ్బాయిని నేరుగా హాస్పిటల్ తీసుకెళ్ళి, సంబంధిత డాక్టర్లతో మాట్లాడి, వ్యాక్సిన్ వేయించి రాబోవు రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యం చేయాలని డాక్టర్లకు సూచించారు.. అనంతరం బాబు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తూ.. ఇతర ఖర్చుల నిమిత్తం ₹5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరాం, బదిరెడ్డి దొర, అడ్డాల శ్రీను, స్టాలిన్, కొల్లు రమేష్, గల్లా శ్రీను తదితరులు బత్తుల వెంకటలక్ష్మి వెంట ఉన్నారు.