కరోనా సమయంలో ద్రాక్ష తింటే ప్రయోజనాలు

కరోనా వాక్సిన్ వచ్చేవరకు జాగ్రత్తలు పాటిస్తూ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. తక్షణ శక్తినిఛ్చి, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంలో ఎండు ద్రాక్ష ముఖ్యమైనది గా నిపుణులు చెబుతున్నారు.

ద్రాక్ష తింటే  ప్రయోజనాలు:

ఎండు ద్రాక్ష తీసుకుంటే శరీరంలో ఇమ్యునిటీ పెంచుకోవచ్చు.

ఎండు ద్రాక్ష రెగ్యులర్గా తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

కరోనా సమయంలో చాలామంది గొంతునొప్పితో బాధపడుతున్నారు. అలాంటి వారు వేడి నీటిలో ఎండు ద్రాక్షను నానబెట్టి తీసుకుంటే గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. లివర్ సమస్యలు రక్తహీనత సమస్య ఉన్నవారు ఎండు ద్రాక్ష తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

నీరసం నిస్సత్తువ ఉన్నప్పుడు కూడా ఎండుద్రాక్ష అంటే తక్షణ శక్తి లభిస్తుంది.

అలాగే రక్తపోటు అదుపులో ఉండే గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.