భీమ్ నగర్ లో ఎస్.ఎల్.ఎఫ్. కమ్యూనిటీహాల్‌ ప్రారంభం

  • ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన డాక్టర్ కందుల
  • నియోజకవర్గంలో కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట
  • 76వ రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట

వైజాగ్ సౌత్: జీవీఎంసీ 32వ వార్డు భీమ్ నగర్ లో స్లం లెవెల్ ఫెడరేషన్ కమ్యూనిటీ హాల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని స్లం లెవెల్ ఫెడరేషన్ హాలును ప్రారంభించారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం శనివారం నాటికి 76వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భీమ్ నగర్ లో ఎస్.ఎల్.ఎఫ్ హాలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ.. మహిళా అభివృద్ధి దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. అన్ని రంగాలలో మగవారికి సమానంగా ముందుకు దూసుకుపోతున్న మహిళలు భవిష్యత్తులో ప్రపంచ ప్రగతికి కారకులవుతారని కొనియాడారు. జనసేన పార్టీ మహిళలకు పెద్ద పీట వేస్తుందని చెప్పారు. పార్టీలో సమర్ధులైన మహిళా నాయకులు ఉన్నారని తెలిపారు. తాను కూడా స్త్రీ పక్షపాతిని అని చెప్పారు. మహిళల అభ్యుదయం కోసం తాను నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తాను ఒక కుటుంబ సభ్యుడిగా ముందు ఉండి వారికి సహాయంగా ఉంటానని తెలిపారు. భవిష్యత్తు జన సేనదే అని చెప్పారు. తమ పార్టీ మహిళలకు మరింత ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ పటిష్టంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనసేన ఇక్కడ సునాయాస విజయం సాధిస్తుందని చెప్పారు. పార్టీ కేడర్ అంతా సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారని, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నిర్విరామంగా జనంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్.పి.కమల, ఎస్.ఎల్.ఎఫ్. ప్రెసిడెంట్ పద్మ, సత్యవతి, అప్పియమ్మ, సత్య, కనకదుర్గ, కనకమహాలక్ష్మి, కనకమహాలక్ష్మి, కుమారి తదితరులు పాల్గొన్నారు.