పుతిన్ ని “కిల్లర్”గా అభివర్ణించిన బైడెన్..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ను నష్టం కలిగేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్యవర్తిత్వం చేశాడన్న నిఘా వర్గాల సమాచారంతో అమెరికా అధ్యక్షుడు తీవ్ర విమర్శలు చేశారు. పుతిన్‌ కిల్లర్‌ అని, మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రష్యా …అమెరికా రాయబారిని మాస్కోకు పిలిపించి…వివరణ కోరింది. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ అభ్యర్థిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా, డొనాల్డ్‌ ట్రంప్‌ను పుతిన్‌ ప్రోత్సహించారని అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదిక గురించి ప్రస్తావిస్తూ.. ఆయన మూల్యం చెల్లించుకుంటారని ఓ ఇంటర్వ్యూలో బైడెన్‌ అన్నారు. ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్సీ, ఇతర ప్రత్యర్థులపై విషప్రయోగానికి ఆదేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పుతిన్‌పై స్పందిస్తూ….ఆయనో కిల్లర్‌ అంటూ వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యలను రష్యా ఖండించింది. అమెరికా రాయబారిని పిలిచి..స్పందించాలని కోరింది.