కళాతపస్వి విశ్వనాథ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని కలిగిన దర్శకులు కళాతపస్వి శ్రీ కె. విశ్వనాథ్. వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వయంకృషి, స్వాతిముత్యం… ఇలా ఆయన తెలుగు చిత్రసీమకు ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు అందించారు. మన సంస్కృతి సంప్రదాయాలు, కళలు, తెలుగు భాషకు వెండి తెరపై ఆయన ఆవిష్కరించిన విధానం నవతరానికి స్ఫూర్తిదాయకం. విశ్వనాథ్ గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నానని జనసేనాని తెలిపారు.