సత్తివాణి పాలెం యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

  • సత్తివాణి పాలెం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్

పెందుర్తి నియోజకవర్గం: 88 వార్డ్, సత్తివానిపాలెం గ్రామంలో యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన సభలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ చెడు దోవలో వెళ్తున్న యువతకి సత్తివాణి పాలెం యూత్ ఒక ఆదర్శంగా నిలిచి వారి మిత్రులు జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడాన్ని హర్షించదగ్గ విషయం అని, ఈ గ్రామంలో ఆరోగ్య సమస్యలతో యువకులు చనిపోవడం జరిగిందని వారి జ్ఞాపకార్థంగా ఈ రక్తదాన శిబిరం వారి మిత్రులందరికీ ఏర్పాటు చేసి వారి కుటుంబానికి ధైర్యంగా నిలవడాని ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేసిన గ్రామ ప్రజలకు పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మేకల అప్పారావు, చిల్ల శ్రీనివాస్, లంక సూరిబాబు, సత్తివాడ శంకర్, గంగు నాయుడు, రూపేష్, శివాజీ, గవర శ్రీను, ప్రవీణ్ మరియు యువత పాల్గొన్నారు.