ఆప్ సబ్ కీ ఆవాజ్, వైజాగ్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

విశాఖ: వైజాగ్ పల్సస్ సంస్థలో ఆప్ సబ్ కీ ఆవాజ్ మరియు వైజాగ్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పల్సస్ సంస్థ ఛైర్మన్ శ్రీనుబాబు గేదెల సమక్షంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో పల్సస్ సంస్థ ఉద్యోగులు, ఉద్యోగినులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పల్సస్ సంస్థ ఛైర్మన్ శ్రీనుబాబు గేదెల, రోటరీ క్లబ్ ఛైర్మన్ రాజు, ప్రతాప్, వైజాగ్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి రాజకుమారి, ఆప్ సబ్ కీ ఆవాజ్ జనరల్ సెక్రటరీ బావిశెట్టి కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రాఘవ, ప్రతినిధులు రవితేజ, వీరేశ్వరరావు , రౌతు బాలాజీ, కొమిరిశెట్టి నాని బాబు, కొమ్ముల భార్గవ్ వంశీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పల్సస్ సంస్థ ఉద్యోగులకు సంస్థ ఛైర్మన్ శ్రీనుబాబు గేదెల చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ జనరల్ సెక్రటరీ బావిశెట్టి కిరణ్ కుమార్ మరియు వైజాగ్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి రాజకుమారి పల్సస్ చైర్మన్ శ్రీనుబాబు గేదెలకి ఒక మెమెంటో అందచేసారు. ప్రత్యేక అతిధులుగా ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్టు మరియు గోల్డ్ మెడలిస్ట్ డా.జి.మహేష్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, డా. శ్రీ కీర్తి రామకృష్ తమ విలువైన సందేశాన్ని ఇచ్చారు. మరియు రక్తదాన శిబిరం జయప్రదం చేసిన పల్సస్ ఉద్యోగులను, రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఆప్ సబ్ కీ ఆవాజ్ జనరల్ సెక్రటరీ బావిశెట్టి కిరణ్ కుమార్ ని, వైజాగ్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి రాజకుమారి కి ప్రత్యేకంగా అభినందించారు.