జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయం నందు జాతీయ జెండాను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఎగరవేయడం జరిగింది.
ఈ సందర్బంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణాలను ఫణంగా పెట్టి జైళ్లలో మగ్గి మనకి స్వాతంత్రాన్ని తెచ్చి పెడితే.. నేటి పాలకులు దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్యకరమైన పదజాలాలు వాడుతూ ప్రజల యొక్క కష్టాలని ప్రజల యొక్క సమస్యలని రాష్ట్ర అభివృద్ధిని గురించి మాట్లాడకుండా వాళ్ళ స్వలాభాల కోసం వాళ్లకి ఇష్టానుసారంగా నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ సమాజంలో ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోవడం మహాత్మా గాంధీ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం మన జన్మ హక్కు అని ఆయన కోరితే మరి గ్రామాలలో అభివృద్ధి చూస్తే ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి నిజమైన స్వాతంత్య్రం రావాలంటే ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులకి ఎప్పుడైతే పనులు జరుగుతాయో ఆనాడే నిజమైన స్వాతంత్రం వస్తుంది అని కోరుకుంటున్నా.. అది రావాలి అంటే నీతి నిజాయితీ కలిగిన నాయకులని ఎన్నుకోవాలి ఆనాడే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్టు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేష్, కాకి శివకుమార్, శ్రీహరి, రహమాన్, సంజూ రాకేష్, కాజా, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *