జనసేనాని జన్మదిన సందర్భంగా మట్టి విగ్రహాల పంపిణీ చేసిన బొబ్బిలి జనసేన

బొబ్బిలి, జనసేన పార్టీ 7 ముఖ్య సిద్ధంతాలలో ఒక్కటైనా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ బొబ్బిలి ఆర్టీసి కాంప్లెక్స్ లాస్య గిఫ్ట్ ఆర్టికల్స్ దగ్గర బొబ్బిలి జనసేన నాయుకులు సంచాన గంగాధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరి చేతుల మీదుగా పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పారది ఎంపిటిసి అభ్యర్థి బంటుపల్లి దివ్య, పళ్లెం రాజా, చీమల సతీష్, మండల నాయకులు పొట్నూరు జనార్ధన, గేదెల శివ, పిట్ట కిరణ్, చరణ్, రమేష్, జగన్, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.