ప్రజా సమస్యల పరిష్కారం దిశగా బొబ్బిలి జనసేన

బొబ్బిలి నియోజకవర్గం, రామభద్రపురం మండలంలో స్థానిక బస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారి గోతులతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. బొబ్బిలి నియోజకవర్గ జనసేన నాయకులు మహంతి ధనంజయ్ ఆధ్యర్యంలో గోతులు పూడ్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ సాయి, శ్యామ్, చిన్న, బాషా, తమ్మినాయుడు, వినోద్ అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొనడం జరిగింది.