ప్రజల మధ్యలో ఘనంగా బొలిశెట్టి పుట్టినరోజు వేడుకలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా మాగంటి కళ్యాణ మండపంలో జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా వర్తనపల్లి కాశి ఆధ్వర్యంలో పడాల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరము ఊరేగింపు నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా గజమాలతో బొలిశెట్టినీ సత్కరించి ఊరేగింపుగా మాగంటి కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం పుల్లా బాబి, అడపా ప్రసాద్, వర్తనపల్లి కాశి, వెజ్జు రత్నకుమారి, పెనుబోతుల సోమలమ్మ, విష్ణు ప్రియ గరగ, వీరి ఆధ్వర్యంలో మాగంటిలో 62 కేజీ కేక్ కటింగ్ అనంతరం కేశవభట్ల విజయ్, మట్ట రామకృష్ణ, అత్తిలి బాబి, కాజులూరి మల్లేశ్వరరావు, బయనపాలెపు ముఖేష్ లచే శ్రీనివాస్ కి 150 కేజీ లతో పూలాబీషేకం చేశారు. మరియు పలువురు పూలమాలలు వేసి గజమాలలతో సత్కరించారు. అనంతరం జనసేన జిల్లాలో నాయకులు చాగంటి మురళీకృష్ణ, రెడ్డి అప్పలనాయుడు, గుండా జయ ప్రకాష్ నాయుడు, పత్సమట్ల ధర్మరాజు, విడివాడ రామచంద్రరావు పరువులు ఇచ్చేసి శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేశారు. ఇలా ఉండగా తాడేపల్లిగూడెం నుంచి వలవల బాబ్జి, గొర్రెల శ్రీధర్, తెలుగుదేశం ఎక్స్ కౌన్సిలర్ మరియు ముఖ్య నాయకులు, బిజెపి నుంచి ఈతకోట తాతాజీ, భోగి రెడ్డి ఆది లక్ష్మి, బిజెపి ప్రముఖులు కాంగ్రెస్ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నుంచి మారం వెంకటేశ్వరరావు, గమని సుబ్బారావు, ఆర్యవైశ్య ముఖ్య ప్రముఖులు, మరియు ప్రముఖ డాక్టర్లు విద్యాసంస్థలు లాయర్లు, బంగారం వర్తక సంఘం, రజకుల సంఘం, మోటర్ యూనియన్, భవన నిర్మాణాల కార్మిక సంఘం, గౌడ సంఘం, వివిధ బీసీల సంఘాలవారు, కాపు సంఘం వారు, ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్, పట్టణ పుర ప్రముఖులు విచ్చేశారు. అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం వివిధ సంస్థలలో బొలిశెట్టి శ్రీనివాస్ అభిమానులు అన్నదాన కార్యక్రమాలు చేశారు. మాధవరం గ్రామంలో కారుణ్య కేర్ సెంటర్ నందు శ్రీనివాస్ అభిమాని 5000 రూపాయల నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.