జనసేన నేతల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన బొలియశెట్టి శ్రీకాంత్

విశాఖపట్నం జనవాణి కార్యక్రమము నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తున్నారని తెలిసి జనసేనపార్టీ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున ఎయిర్ పోర్ట్ కి స్వాగతం పలకడానికి మధ్యాహ్నం 12 గంటలు నుండి ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ 4.30 నిమిషాలకు విమానం దిగుతారని తెలిసి కావాలని వైసీపీ మంత్రులు జోగి రమేష్, రోజా అదే టైమ్ కి అక్కడకు వచ్చారు. కావాలనే కోడికత్తి రాజకీయాలు చేసి మా మీద దాడి చేశారు అని జనసేనపార్టీ నాయకులు మీద కార్యకర్తలు మీద కేసులు బనాయించి అరెస్ట్ చేయించారు. విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమాలు జరగకుండా ఉండటానికి వారం రోజులు ముందు నుండి జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇదే రోజా, జోగిరమేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఫ్యామిలి గురించి కూడా ఘాటుగా విమర్శించారు కోస్తాంధ్ర మంత్రులు ఎమ్మెల్యేలు లు అయితే పవన్ కళ్యాణ్ వైజాగ్ ఎలా వస్తారో మేము చూస్తాం అని ఛాలెంజ్ కూడా చేశారు. కోడికత్తి రాజకీయాలు చేసి శనివారం పవన్ కళ్యాణ్ వెళ్తే కావాలనే రెచ్చగొట్టి నాయకులను కార్యకర్తలను అరెస్ట్ అయ్యే వరకు వదలలేదు పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్ట్ నుండి నోవాటెల్ వెళ్ళేదారిలో ట్రాఫిక్ క్లియర్ చెయ్యకుండా పవర్ కట్ చేసి కళ్యాణ్ ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఈ సందర్భంగా మేము జనసేనపార్టీ నుండి ప్రశ్నిస్తున్నాం. మేము జనవాణి కార్యక్రమం సక్రమంగా జరిపించడానికి, జనసేనపార్టీ కార్యకర్తలు ప్రమాదంలో చనిపోయిన వారి ప్రమాద భీమా ఇవ్వడానికి వస్తే కావాలని రెచ్చగొట్టి మా నాయకుల్ని అరెస్ట్ చేస్తారా ఇదేనా మీ ప్రభుత్వ పాలన? రుషికొండ మొత్తం దోచేసారు, భారత సైనికులు భూములు లాగేసుకున్నారు , పేదవాడి భూమిలు లాగేసుకున్నారు, విశాఖపట్నం ఖనిజాలు మొత్తం దోచేసారు ఇంకా ఏమి దోచుకోవాలని మూడు రాజధానులు కావాలని తెర మీదకు తీసుకొని వచ్చారు? రాష్ట్రం విడగొట్టేటప్పుడు ప్రాంతాల వారిగా గొడవలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. విశాఖపట్నం అన్నివిధాలుగా అన్ని సౌకర్యాలతో దేశంలోని ఉత్తమ సిటీగా పేరు ఉంది. అక్కడ రాజధాని అంటే ఎవరు అయినా నమ్ముతారా…? వైజాగ్ గర్జన పేరుతో ఎవరైనా మనస్పూర్తిగా వచ్చారా? డ్వాక్రా మహిళకు, రోజువారీ కులీలకు 500 రూపాయిలు, బిర్యానీ పాకెట్ ఇచ్చి తీసుకొని వచ్చారు. దానికి మీరు సక్సెస్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు చేసిన తప్పిదాలు ప్రశ్నస్తే మా జనసేనపార్టీ కార్యకర్తలు మీద కేసులు పెడుతున్నారు. అరెస్ట్ అయిన మా నాయకుల్ని కార్యకర్తలను త్వరగా విడుదల చేయాలని ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ హెచ్చరించారు.