క్రీడా ప్రాంగణానికి మౌళిక సదుపాయాలు కల్పిస్తానన్న బొర్రా

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి రూరల్ స్థానిక విన్నాదేవి గ్రామంలోని వావిలాలనగర్ లో పర్యటించిన సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు. స్థానిక ప్రజానికముతో మమేకమైన బొర్రా వారి యొక్క సమస్యలను తెలుసుకొని, మన ప్రభుత్వ రాగానే పరిష్కార దిశగా తీసుకువెళతానని అన్నారు. యువతతో మాట్లాడిన బొర్రా వారికి క్రీడా ప్రాంగణానికి మౌలిక వసతులను కల్పిస్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఏడో వార్డ్ కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరావు, చిలక పూర్ణ, అంకారావు, గట్టు శ్రీదేవి, సొల్లన్నబి, మోహన్, రంజిత్, కన్నా, చంటి, విన్నోత్, విజయ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.