వీరభద్ర స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామంలో వేంచేసియున్న భద్రకాళి సమేత ఉత్కంఠ వీరభద్ర స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. సుమారు నాలుగు కోట్ల రూపాయలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమానికి కుంకలగుంట గ్రామ జనసైనికులు, అలాగే మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్ సత్తనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకటప్పరావు ను ఆహ్వానించడం జరిగినది. ఆహ్వానం మేరకు గ్రామానికి వెళ్లి అక్కడ స్వామివారి ఆలయన్ని సందర్శించి స్వామి వారి యొక్క ఆశీర్వచనం తీసుకొని ప్రత్యేక పూజలు పాల్గొనడం జరిగినది. భద్రకాళి సమేత ఉత్కంఠ వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి సత్తనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు 100006 రూపాయలు అదేవ్ధంగా వినాయకుని గుడికి 50002 వేల రూపాయలు దేవాలయాల నిర్మాణానికి అప్పారావు గారు విరాళం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికలు మండలం వైస్ ప్రెసిడెంట్ రఫీ, పసుపులేటి పవన్ కళ్యాణ్, షేక్ జాన్ ఫిరా, మండల కమిటీ సభ్యులు, అలాగే గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.