షట్టర్ పగలకొట్టి మరీ అరెస్ట్ చేసి స్టేషన్లో నిర్భందించడం పిరికిపంద చర్య: మరీదు శివరామకృష్ణ

నూజివీడులో జనసేన నేతలను ముందస్తు అక్రమ అరెస్ట్ లు చేయడం పిరికిపంద చర్య అని ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి, నూజివీడు నియోజకవర్గం నేత శివరామకృష్ణ అన్నారు. సీఎం పర్యటన సందర్భంగా జనసేన నేతలు ఉదయం అరెస్ట్ చేసి నియోజకవర్గంలో ముసునూరూ పోలీస్ స్టేషన్లో జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణతో పాటు నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ బండారు రాజు, టీడీపీ నేత గద్దె రఘు తదితరులను అరెస్ట్ చేసారని తెలిపారు. ఆఫీస్ లో ఉంటే షట్టర్ పగలకొట్టి అరెస్ట్ చేసి స్టేషన్లో ముఖ్యమంత్రి వెళ్ళే వరకు నిర్బంధించటం నియంత పాలనకు నిదర్శనం అని విమర్శించారు. టౌన్ కి ఇస్తాను అన్న 33 కోట్లు ఇవ్వకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. శుక్రవారం నూజివీడు జనసేన నాయకులు పాశం నాగబాబుని కూడా అరెస్టు చేయడం జరిగింది.