అట్టహాసంగా ప్రారంభమైన బి.ఆర్.కె మెగా క్రికెట్ టోర్నీ

రాజానగరం, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో సోమవారం బి.ఆర్.కె మెగా క్రికెట్ టోర్నీని నిడిగట్ల గ్రామంలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరాం పర్యవేక్షణలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ యువత చెడు సావాసాలకు తావులేకుండా క్రీడలపట్ల దృష్టిపెట్టి క్రీడా నైపుణ్యాన్ని పెంచుకొని, క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ నియోజకవర్గ స్థాయి టోర్నీలో 40 టీంలు పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ టోర్నీ సుమారు 20 రోజులు పాటు నిడిగట్ల గ్రామంలో నిర్వహిస్తామని, క్రికెట్లో ప్రతిభ కనబరిచిన మొదటి టీముకి 44 వేల 444రూపాయలు, షీల్డ్ అందిస్తామని, అలాగే ద్వితీయ బహుమతి 22 వేల 222 రూపాయలు, తృతీయ బహుమతి 5వేల 555 రూపాయలు గెలుచుకున్న టీములకు అందించనున్నామని తెలియజేశారు. ఈ క్రీడల్లో పాల్గొన్న వారందరికీ కన్సొలేషన్ ప్రైజెస్ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.