గాజుల శంకరరావును పరామర్శించిన బుద్ధప్రసాద్

అవనిగడ్డ: ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శి గాజుల శంకరరావును మాజీ ఉపసభాపతి, ఎన్డీయే కూటమి అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను శంకరరావుని అడిగి తెలుసుకున్నారు. త్వరలో పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని, అవనిగడ్డ నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తుపై ప్రతి ఒక్కరితో ఓటు వేయించి, జనసేన పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని గాజుల శంకరరావు తెలిపారు. బుద్ధప్రసాద్ ని దుశ్శాలువాతో సత్కరించారు. బుద్ధప్రసాద్ తో పాటుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు మండలి రాజేష్, అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, గుడివాక శివరావు, తుంగల రాజా, తుంగల వేణు, మాదివాడ రత్నారావు, కమ్మిలి సాయి భార్గవ, మాదివాడ కుటుంబరావు, జనసైనికులు పాల్గొన్నారు.