తారు రోడ్డు నిర్మించండి.. అధికారులకు జనసేన వినతిపత్రం

పాడేరు: హుకుంపేట మండలం, బూర్జ పంచాయతీ, మజ్జివలస గ్రామ ప్రధాన రహదారి మట్టి రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది. దీనిపై పలుమార్లు తారు రోడ్డు శాంక్షన్ చేయమని అధికారులకు వినతిపత్రం అందచేసినా ఇప్పటి వరకూ ఎటువంటి పనులు మొదలు పెట్టడం లేదు. అలాగే మజ్జివలస నుండి కొండయి పాడు వరకు ఆరు కిలోమీటర్లు, బూర్జ నుంచి తుంబాయి పాడు వరకూ మూడు కిలోమీటర్ల రోడ్డు వేయమని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కు ఆర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బూర్జ పంచాయతీ జనసేన పార్టీ వైస్ సర్పంచ్ పరశురాం, రాప బుద్దు జనసేన పార్టీ మండల నాయకులు, బూర్జ సర్పంచ్ బొంజుబాబు మరియు అప్పన్న, జనసేన పార్టీ మండల నాయకులు బలిజ కోటేశ్వరరావు, తదితరులు ఆర్జీలు లిఖిత పూర్వకంగా కలెక్టర్ కు సమర్పించారు.