సోషల్ మీడియాలో కామెంట్ తో నటి మాధవీలతపై కేసు నమోదు

ప్రముఖ టాలీవుడ్ నటి  మాధవీలతపై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మాధవీలత.. తన ఫేస్‌బుక్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్ పెట్టడంతో, వనస్థలిపురంకు చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి ఆమెపై పిర్యాదు చేశారు. గోపీకృష్ణ పిర్యాదు స్వీకరించిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం ఆమెపై 295-A సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు.