Parchur: “ఛలో గాజువాక” కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

ఈనెల 31వ తేదీన గాజువాకలో జరిగే భారీ బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఉద్యమానికి మద్దతుగా నిలువనున్నారు. కావున ఈ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ నాయకులు, ప్రజలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.
శుక్రవారం ఇంకొల్లు సినిమాహల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ ఇంతియాజ్, మరియు కార్యకర్తలు నారిశెట్టి ప్రవీణ్ కుమార్, బాలినేడి హరిబాబు, పులికం రామకృష్ణారెడ్డి, ముత్యాల గోపి, బొప్పన సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.